Lalit Modi: సన్ రైజర్స్ వివాదం..రంగంలోకి లలిత్ మోదీ
రంగంలోకి లలిత్ మోదీ
Lalit Modi: పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను సన్ రైజర్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడంపై వివాదం రగులుతున్న వేళ మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “అభిమానులు ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న సమయంలో పాక్ ఆటగాడిపై రూ. 2.34 కోట్లు పెట్టారా.. ఇమేజ్ మేనే జ్మెంట్ ఎలా చేయాలో నాకు తెలుసు, నన్ను సంప్రదించండి" అంటూసోషల్ మీడియాలో స్పందించారు.ది హండ్రెడ్ లీగ్ వేలంలో కావ్య మారన్ యాజమాన్యంలో ఉన్న సన్ రైజర్స్ జట్టు అబ్రార్ అహ్మద్ ను సుమారు 1.9 లక్షల పౌండ్లకు కొనుగోలు చేసింది.
ఈ నిర్ణయం సోషల్ మీడియాలో తీవ్ర విమ ర్శలకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తం గా మారడంతో సన్రైజర్స్ లీడ్స్ ఎక్స్ ఖాతా తాత్కాలికంగా సస్పెండ్ అయి నట్లు సమాచారం. 2008 తర్వాత ఐపీఎల్లో పాకిస్తాన్ ఆటగాళ్లపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానుల్లో అసహనాన్ని పెంచింది. సాధారణంగా విదేశీ లీగ్లలో కూడా పాక్ ఆటగాళ్లను దూరంగా ఉంచే భారత జట్లు, ఈసారి భిన్నంగా వ్యవ హరించడంతో చర్చ మొదలైంది. ఇక లలిత్ మోదీ వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత వేడి పెంచాయి.