Asia Cup Begins Today: ఇవాళ్టి నుంచే ఆసియా కప్ ..ఫస్ట్ మ్యాచ్ అఫ్గనిస్తాన్ Vs హాంగ్ కాంగ్

ఫస్ట్ మ్యాచ్ అఫ్గనిస్తాన్ Vs హాంగ్ కాంగ్

Update: 2025-09-09 08:50 GMT

Asia Cup Begins Today: ఆసియా కప్ 2025 ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని దుబాయ్, అబుదాబి నగరాల్లో జరుగుతుంది. ఇది T20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. అబుదాబిలో షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ vs హాంగ్ కాంగ్ తలపడనున్నాయి. రాత్రి 8:00 గంటలకు (భారత కాలమానం ప్రకారం) జరగనుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరుగుతుంది.

టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. వాటిని రెండు గ్రూపులుగా విభజించారు.గ్రూప్-A: భారత్, పాకిస్తాన్, UAE, ఒమన్

గ్రూప్-B: శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంగ్ కాంగ్ ఉన్నాయి.

భారత జట్టు మ్యాచ్‌లు:

సెప్టెంబర్ 10: భారత్ vs UAE (దుబాయ్)

సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్తాన్ (దుబాయ్) - ఈ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్ (అబుదాబి)

Tags:    

Similar News