Sunrisers Hyderabad: కావ్యా మారన్ సంచలన నిర్ణయం.. సన్‌రైజర్స్ టీమ్‌లోకి పాకిస్థాన్ క్రికెటర్!
సన్‌రైజర్స్ టీమ్‌లోకి పాకిస్థాన్ క్రికెటర్!
Sunrisers Hyderabad: బ్రిటన్‌కు చెందిన 'ది హండ్రెడ్' క్రికెట్ లీగ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సుమారు రూ. 2.34 కోట్లకు కొనుగోలు చేసింది. సాధారణంగా ఐపీఎల్ యజమానులు తమ విదేశీ లీగ్ జట్లలో కూడా పాక్ ప్లేయర్లను తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ కావ్యా మారన్ ఈ సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ అబ్రార్‌ను జట్టులోకి తీసుకున్నారు.
ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?
జట్టు హెడ్ కోచ్ డానియల్ వెట్టోరీ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ వేలంలో దొరకకపోవడంతో, ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి తమకు ఒక నాణ్యమైన స్పిన్నర్ అవసరమైందని ఆయన చెప్పారు. అబ్రార్ అహ్మద్ మంచి ఫామ్‌లో ఉండటంతో, కేవలం ఆటగాడి ప్రతిభను చూసి మాత్రమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇక్కడ రాజకీయాలకు చోటు లేదని వెట్టోరీ స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో రచ్చ.. అకౌంట్ సస్పెండ్!
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ పాక్ ఆటగాడిని ఎలా తీసుకుంటుందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అబ్రార్ అహ్మద్ భారత సైన్యానికి వ్యతిరేకంగా ఉన్నట్లు భావించే కొన్ని పోస్ట్లు పెట్టారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ గొడవ కారణంగా, సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక X (ట్విట్టర్) అకౌంట్ కూడా సస్పెండ్ అయ్యింది.
మరో పాక్ ప్లేయర్ కూడా..
అబ్రార్‌తో పాటు ఉస్మాన్ తారిక్ అనే మరో పాక్ స్పిన్నర్ కూడా ఈ వేలంలో అమ్ముడయ్యారు. ఆయన్ని బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ అనే జట్టు సుమారు రూ. 1.73 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఆ జట్టు యజమానులు భారతీయులు కాదు.