Australian star all-rounder Mitchell Marsh: డొమెస్టిక్ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్

Update: 2025-12-09 11:41 GMT

Australian star all-rounder Mitchell Marsh: ఆస్ట్రేలియా స్టార్ ఆల్-రౌండర్ మిచెల్ మార్ష్ దేశవాళీ డొమెస్టిక్ టెస్ట్ క్రికెట్ టోర్నమెంట్ షెఫీల్డ్ షీల్డ్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. మిచెల్ మార్ష్ తన సుదీర్ఘ ఫస్ట్-క్లాస్ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతూ, ఆస్ట్రేలియా దేశవాళీ టెస్ట్ టోర్నమెంట్ అయిన షెఫీల్డ్ షీల్డ్ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లలో (టెస్ట్, వన్డే, T20) కీలకంగా మారడం, ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) ప్రకారం రాబోయే సంవత్సరంలో ఆస్ట్రేలియా బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

తన శరీరాన్ని టెస్ట్ క్రికెట్ సహా అంతర్జాతీయ క్రికెట్ కు సిద్ధంగా ఉంచుకోవడానికి, దేశవాళీ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌ను విడిచిపెట్టడం సరైనదని భావించారు. షెఫీల్డ్ షీల్డ్‌లో మార్ష్ తన రాష్ట్ర జట్టు అయిన పశ్చిమ ఆస్ట్రేలియా (Western Australia) కు ప్రాతినిధ్యం వహించారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున షెఫీల్డ్ షీల్డ్‌లో మార్ష్ 29.50 యావరేజ్ తో 2744 పరుగులు చేయడంతో పాటు 82 వికెట్లు పడగొట్టాడు.

మిచెల్ మార్ష్ కేవలం దేశవాళీ ఫస్ట్-క్లాస్/షెఫీల్డ్ షీల్డ్ క్రికెట్‌కు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ ఆడటం కొనసాగుతారు. అలాగే, పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డేలు, T20లు) బిగ్ బాష్ లీగ్ (BBL) వంటి టోర్నీలలో ఆడతాడు.మార్ష్ ప్రస్తుతం ఆస్ట్రేలియా టీ20 జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. పాట్ కమ్మిన్స్ లేనప్పుడు వన్డే బాధ్యతలు స్వీకరిస్తాడు.ఫిబ్రవరిలో ఇండియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ మార్ష్ ఆస్ట్రేలియా జట్టును నడిపించనున్నాడు.

Tags:    

Similar News