Team India Gets a New T20 Captain: బ్రేకింగ్: భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్‌గా తెలుగు కుర్రాడు.
కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్‌గా తెలుగు కుర్రాడు.
Team India Gets a New T20 Captain: టీమ్‌ఇండియా టీ20 జట్టులో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. భారత సరికొత్త టీ20 సారథిగా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఇప్పటివరకు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్‌కు కెప్టెన్సీ అప్పగిస్తూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు తాజా సెలక్షన్ కమిటీ భేటీ అనంతరం సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన ఈ స్క్వాడ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు అస్సలు చోటే దక్కకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇక మన తెలుగు క్రికెట్ అభిమానులకు ఇదో పెద్ద పండగ లాంటి వార్త! తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు సెలక్షన్ కమిటీ భారీ ప్రమోషన్ ఇచ్చింది. అతడిని ఈ జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమించింది. వీరితో పాటు యువ సంచలనాలు ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీలకు కూడా ఈ టూర్‌లో బంపర్ అవకాశం దక్కింది.
ముందుగా ఐర్లాండ్ టూర్ విషయానికొస్తే.. జూన్ 26న తొలి టీ20, జూన్ 28న రెండో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.ఆ వెంటనే ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. జులై 1న మొదటి టీ20, జులై 4న రెండో మ్యాచ్, జులై 7న మూడో మ్యాచ్, జులై 9న నాల్గో మ్యాచ్, అలాగే జులై 11న చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ జరగనున్నాయి.
ఆసియా గేమ్స్ అప్‌డేట్:
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. త్వరలో జరగబోయే ఆసియా గేమ్స్ స్క్వాడ్‌లోకి టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి వచ్చేశాడు! ఆసియా గేమ్స్‌లో కూడా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా జట్టును నడిపించబోతున్నారు.