Chennai Grandmasters Tournament: ఇవాళ్టి నుంచి చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నీ..విన్నర్ కు రూ. కోటి ప్రైజ్ మనీ
విన్నర్ కు రూ. కోటి ప్రైజ్ మనీ;
Chennai Grandmasters Tournament: ఇవాళ్టి నుంచి చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2025 చెస్ టోర్నమెంట్ ప్రారంభమై ఆగస్టు 15 వరకు జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో మాస్టర్స్, ఛాలెంజర్స్ అనే రెండు భాగాలుగా విభజించారు. టోర్నమెంట్లో మొత్తం 20 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఇందులో 10 మంది మాస్టర్స్ విభాగంలో, మరో 10 మంది ఛాలెంజర్స్ విభాగంలో ఉంటారు.
భారత అగ్రశ్రేణి క్రీడాకారులు అర్జున్ ఎరిగైసి, విదిత్ గుజరాతీ, నిహాల్ సరీన్ వంటి వారు మాస్టర్స్ విభాగంలో పాల్గొంటున్నారు.విదేశాల నుంచి నెదర్లాండ్స్ కు చెందిన అనీష్ గిరి, జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్, అమెరికా ప్లేయర్స్ రే రాబ్సన్, అవాండర్ లియాంగ్ వంటి వారు కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు.ఈ ఏడాది ఛాలెంజర్స్ విభాగంలో విజేత అయిన ప్రణవ్ వెంకటేష్ మొదటిసారిగా మాస్టర్స్ విభాగంలో ఆడుతున్నాడు.
గత రెండు సీజన్లలో ఏడు రౌండ్లతో జరిగిన ఈవెంట్‌కు పూర్తి భిన్నంగా ఉండనుంది. ఈ టోర్నమెంట్‌లో ప్లేయర్లకు ఫిడే సర్క్యూట్ పాయింట్లు లభిస్తాయి. ఇవి 2026లో జరిగే క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు క్వాలిఫై అవ్వడానికి కీలకం.ఈ టోర్నమెంట్ విజేతలకు ఒక కోటి రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది.