Commonwealth Games: అహ్మదాబాద్ లో కామన్వెల్త్ గేమ్స్
కామన్వెల్త్ గేమ్స్
Commonwealth Games: 2030 కామన్వెల్త్ గేమ్స్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరగనున్నాయి. ఈ నిర్ణయాన్ని స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీలో అధికారికంగా ఆమోదించారు. జనరల్ అసెంబ్లీలో 74 మంది సభ్యులు భారత బిడ్డింగ్‌కు ఆమోదముద్ర వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 1930లో తొలిసారిగా ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్‌కు 2030 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. కాబట్టి, ఈ ఎడిషన్ శతాబ్ది గేమ్స్ అవుతుంది.2010లో ఢిల్లీలో నిర్వహించిన తర్వాత, భారతదేశం మళ్ళీ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండవసారి.
నరేంద్ర మోదీ స్టేడియం - ప్రారంభ, ముగింపు వేడుకలకు ప్రధాన వేదిక.సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్ ఇక్కడే అథ్లెట్స్ విలేజ్, అనేక క్రీడా వేదికలు ఉంటాయి.2030 గేమ్స్‌లో 15 నుంచి 17 క్రీడలు ఉండే అవకాశం ఉంది. ఆర్చరీ, బ్యాడ్మింటన్, T20 క్రికెట్, షూటింగ్, హాకీ, రెజ్లింగ్ వంటి క్రీడలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.ఈ మెగా ఈవెంట్ భారతదేశంలో క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి , 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.