Divyadesh Mukh: చరిత్ర సృష్టించిన దివ్యదేశ్ ముఖ్
దివ్యదేశ్ ముఖ్;
Divyadesh Mukh: ఫిడే మహిళల ప్రపంచ కప్ 2025 విజేతగా భారత యువ గ్రాండ్ మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో ఆమె అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, ఫైనల్‌లో మరో భారత స్టార్ క్రీడాకారిణి కోనేరు హంపిని ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.
ఈ విజయం దివ్యకు చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే దీనితో ఆమె గ్రాండ్ మాస్టర్ (GM) హోదాను సాధించింది. 19 ఏళ్ల దివ్య భారత్ నుంచి గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన 88వ క్రీడాకారిణి అలాగే నాలుగవ మహిళా గ్రాండ్ మాస్టర్.
ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది, క్లాసికల్ గేమ్స్ డ్రా అవ్వడంతో టై-బ్రేకర్ అనివార్యమైంది. టై -బ్రేకర్స్‌లో దివ్య తన సంయమనాన్ని కోల్పోకుండా, ఒత్తిడిలో కోనేరు హంపి చేసిన తప్పులను సద్వినియోగం చేసుకొని విజయం సాధించింది. ఆమె ఈ టోర్నమెంట్‌లోకి 15వ సీడ్‌గా అడుగుపెట్టి, అనేక మంది టాప్ ర్యాంక్ క్రీడాకారిణులను ఓడించి టైటిల్ గెలుచుకోవడం విశేషం.దివ్య దేశ్‌ముఖ్ విజయం భారత చెస్ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి, యువ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ.