FIDE Women's Chess World Cup Final 2025: టై బ్రేకర్ లోనే తేలనున్న విన్నర్

విన్నర్

Update: 2025-07-28 04:36 GMT

FIDE Women's Chess World Cup Final 2025:  ప్రస్తుతం ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ 2025లో ఫైనల్ జరుగుతోంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఇద్దరు భారత క్రీడాకారిణులు తలపడుతున్నారు. కోనేరు హంపి,దివ్య దేశ్‌ముఖ్. ఇది భారత చెస్ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం, ఎందుకంటే ఎవరు గెలిచినా ఫిడే మహిళల ప్రపంచకప్ టైటిల్ తొలిసారిగా భారత్‌కే దక్కనుంది. ఫైనల్‌లో భాగంగా జరిగిన రెండు క్లాసికల్ గేమ్స్ (శనివారం,ఆదివారం) డ్రాగా ముగిశాయి. దీంతో విన్నర్ ఎవరో ఇవాళ సోమవారం టై-బ్రేకర్ మ్యాచ్ లో తేలనుంది.

ఫిడే మహిళల ప్రపంచకప్ చరిత్రలో ఇద్దరు భారతీయ క్రీడాకారిణులు ఫైనల్‌కు చేరడం ఇదే మొదటిసారి. ఇది భారత చెస్‌కు గొప్ప విజయం . సెమీఫైనల్‌లో చైనాకు చెందిన టింగ్జీ లీని టై-బ్రేక్‌లో ఓడించి కోనేరు హంపి ఫైనల్‌కు చేరుకుంది. ఆమె ఇప్పటికే 2019లో మహిళల ర్యాపిడ్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచారు.

యువ సంచలనం దివ్య దేశ్ ముఖ్ సెమీఫైనల్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ చైనాకు చెందిన టాన్ జోంగ్జీని ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ టోర్నమెంట్‌లో ఆమె అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది.

Tags:    

Similar News