Pratika Rawal: ఇండియా విమెన్స్ జట్టు క్రికెటర్ ప్రతీకా రావల్‌కు జరిమానా విధించారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో రెండు వేర్వేరు సంఘటనలకు కారణమైనందుకు రావల్ మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ కేటాయించారు. 18వ ఓవర్‌లో ఇంగ్లిష్ బౌలర్ లారెన్ ఫైలర్, తర్వాతి ఓవర్‌లో సోఫీ ఎకిల్‌స్టోన్‌ను తోసుకుంటూ వెళ్లినట్లుగా మ్యాచ్ రిఫరీ తేల్చారు. 24 నెలల కాలంలో ఆమె చేసిన తొలి తప్పిదం ఇది.
ఇక స్లో ఓవర్ రేట్‌కు పాల్పడిన ఇంగ్లండ్ జట్టు మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధించారు. నిర్దేశించిన సమయంలో వేయాల్సిన కోటా కంటే ఒక్క ఓవర్ తక్కువగా వేయడంతో రిఫరీ ఈ చర్య తీసుకున్నారు. ఇంగ్లండ్ కెప్టెన్ సివర్ బ్రంట్ తప్పిదాన్ని అంగీకరించడంతో విచారణ అవసరం లేదని ఐసీసీ పేర్కొంది.