Rohit Sharma’s Tweet Goes Viral: ఆస్ట్రేలియాకు గుడ్ బై.. రోహిత్ శర్మ ట్వీట్ వైరల్
రోహిత్ శర్మ ట్వీట్ వైరల్
Rohit Sharma’s Tweet Goes Viral: రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆయన తన అధికారిక X (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఒక ఫోటోను పంచుకుంటూ ఇలా రాశారు. చివరిసారిగా, సిడ్నీ నుండి వీడ్కోలు అని
పోస్ట్ చేశారు. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ తరపున ఆయన ఆడిన చివరి మ్యాచ్ ఇదే కావచ్చనే ఊహాగానాలకు దారి తీసింది. సిడ్నీలో ఆస్ట్రేలియాపై అద్భుతమైన సెంచరీతో సిరీస్‌ను ముగించిన తర్వాత ఆయన ఈ పోస్ట్ చేశారు.
సిడ్నీలో 125 బంతుల్లో 121 పరుగులతో రోహిత్ తన కెరీర్ లో 50 వ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా ఆస్ట్రేలియా గడ్డపై ఆరు సెంచరీలు..ఓవరాల్ గా ఆస్ట్రేలియాపై 9 సెంచరీలు..2500 పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు.
రోహిత్ శర్మ టీ20 , టెస్ట్ ఫార్మాట్‌ల నుండి రిటైర్ అయ్యారు, కానీ వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతున్నారు. 2027 ప్రపంచకప్ తర్వాతే వన్డే క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలకాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
రోహిత్ శర్మ త్వరలో వన్డే క్రికెట్‌కు రిటైర్ అవుతారనే ఊహాగానాలు ఉన్నప్పటికీ, అతని బాల్య కోచ్ దినేష్ లాడ్ ఇటీవల కీలక విషయాన్ని వెల్లడించారు. రోహిత్ శర్మ 2027 ODI ప్రపంచకప్ ఆడిన తర్వాతే అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు చెప్పాలని ప్లాన్ చేస్తున్నట్లు కోచ్ దినేష్ లాడ్ తెలిపారు.