Cricket:29 ఏళ్లకే క్రికెట్ కు గుడ్ బై.. ఎందుకిలా..?
క్రికెట్ కు గుడ్ బై.. ఎందుకిలా..?;
Cricket: వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ 29 ఏళ్లకే ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పి అందరినీ షాక్ కు గురిచేశాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో సిక్సులతో చెలరేగిన ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ తక్కువ యసులోనే క్రికెట్ నుంచి తప్పుకోవడంతో అతడి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎంతో ఆలోచించాక రిటైర్మెంట్ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చానని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు పూరన్. ఇది చాలా కష్టమైన నిర్ణయమే అయినప్పటికీ.. పర్సనల్ లైఫ్, ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.క్రికెట్ తనకు ఎంతో ఇచ్చిందని, ఎన్నో జ్ఞాపకాలు, అనుభవాలు ఉన్నాయని తెలిపాడు. వెస్ట్ ఇండీస్ ప్రజలకు ప్రాతినిథ్యం వహించడం అదృష్టమని చెప్పాడు.
నికోలస్ పూరన్ 2016 సెప్టెంబర్ లో వెస్టిండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశించాడు. మొత్తం 61 వన్డేలు ఆడిన పూరన్ 1983 పరుగులు చేశాడు. 2023 జులై తర్వాత ఇంటర్నేషనల్ వండే మ్యాచ్ ఆడలేదు. అదేవిధంగా 106 టీ20ల్లో 2,275 పరుగులు చేశాడు. దీంతో కరీబియన్ T20 లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ గా పూరన్ రికార్డు సృష్టించాడు. 136.39 స్ట్రైక్ రేట్ తో ఈ స్కోర్ సాధించడం విశేషం.
పూరన్ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. టీ20ల్లో మాత్రం పూరన్ సూపర్ ఫామ్ కొనసాగిస్తూనే వచ్చాడు. లాస్ట్ ఐపీఎల్ సీజన్ లో 36 సిక్సర్లు కొట్టి ఆ సీజన్ లో అత్యధిక సిక్సర్ల వీరుడిగా రికార్డుకెక్కాడు. 2025 ఐపీఎల్ లో కూడా 40 సిక్సులతో మోత మోగించాడు.