Harbhajan Singh’s Key Comments: కోహ్లీ, రోహిత్‌లను మించిన ఆటగాళ్లు ఉన్నారా..? హర్భజన్ కీలక కామెంట్స్..
హర్భజన్ కీలక కామెంట్స్..
Harbhajan Singh’s Key Comments: టీ20, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027లో జరగబోయే వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనడమే లక్ష్యంగా వారు ముందుకు సాగుతున్న ఈ సమయంలో వారి భవిష్యత్తుపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వింటేజ్ కోహ్లీ ఫామ్: సత్తా చాటిన సీనియర్లు
ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ, రోహిత్ అద్భుతంగా రాణించారు. మొదటి రెండు వన్డేల్లో వరుస సెంచరీలు, మూడో వన్డేలో హాఫ్‌సెంచరీతో పాత వింటేజ్ ఫామ్‌ను గుర్తు చేశారు. ఓవరాల్‌గా 302 రన్స్ చేసి సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచారు. రాంచీ, విశాఖపట్నం వన్డేల్లో హాఫ్ సెంచరీలు (57, 75) సాధించి ఫామ్‌లో ఉన్నట్లు నిరూపించారు.
హర్భజన్ సూచన: సీనియర్‌లకు చోటు ఇవ్వాలి
తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన హర్భజన్ సింగ్, టీమిండియా మేనేజ్‌మెంట్‌కు కీలక సూచన చేశారు. "రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంటే మెరుగైన ఆటగాళ్లు ప్రస్తుతం ఉన్నారా? కాబట్టి వారిని జట్టు నుంచి తప్పించకూడదు. ముందుగా వారిద్దరినీ జట్టులోకి తీసుకున్న తర్వాతే మిగతా ఆటగాళ్లను ఎంపిక చేయాలి అని ఆయన కుండబద్దలు కొట్టారు. జట్టు మొత్తాన్నీ యువ క్రికెటర్లతో నింపడానికి చూస్తే, పెద్ద మ్యాచుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు. యువ క్రికెటర్లు సీనియర్ల అనుభవాన్ని ఉపయోగించుకునేలా జట్టును రూపొందించాలని స్పష్టం చేశారు.