India A Register Record Victory: అఫ్గాన్ పై ఇండియా--ఎ రికార్డ్ విక్టరీ... ఫైనల్లోకి భారత్
ఫైనల్లోకి భారత్
India A Register Record Victory: ఇండియా–ఎ జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో తిరుగులేని ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లింది.బుధవారం జరిగిన కీలక లీగ్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్–ఎ జట్టుపై 101 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. తిలక్ వర్మ, ప్రియాన్షు ఆర్యా, కుమార్ కుశాగ్ర హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ ఈ విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఇండియా–ఎ మొదట బ్యాటింగ్ చేసి.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోరు చేసింది. యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 38, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 30, విప్రజ్ నిగమ్ 30 పరుగులతో రాణించగా.. మిడిలార్డర్‌లో తిలక్ వర్మ (59), ప్రియాన్షు ఆర్యా (58), కుమార్ కుశాగ్ర (58) బాధ్యతాయుత హాఫ్ సెంచరీలతో టీమ్‌కు భారీ స్కోరును అందించారు.
అనంతరం 320 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్–ఎ జట్టు.. భారత బౌలర్ల ధాటికి 36.5 ఓవర్లలోనే 218 పరుగులకే ఆలౌట్ అయింది. అఫ్గాన్ బ్యాటర్లలో బహిర్ షా 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫైజల్ 46, ఇమ్రాన్ మిర్ 32 పరుగులతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. భారత బౌలర్లలో నిశాంత్ సంధు 4 వికెట్లతో అఫ్గాన్ నడుం విరగ్గా.. యష్ ఠాకూర్ 2 వికెట్లతో అండగా నిలిచాడు. అద్భుతమైన స్పెల్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన నిశాంత్ సంధుకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.