India Cricket Chief Selector Ajit Agarkar: వరుస సెంచరీలు చేసినా.. రోహిత్ ,కోహ్లీకి చాన్స్ కష్టమే

రోహిత్ ,కోహ్లీకి చాన్స్ కష్టమే

Update: 2025-10-18 04:40 GMT

India Cricket Chief Selector Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు, ముఖ్యంగా 2027 ప్రపంచ కప్‌లో ఆడటం గురించి రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఇప్పటివరకు సెలక్షన్ కమిటీకి ఖచ్చితమైన హామీ ఇవ్వలేదని అగార్కర్ తెలిపారు. ఆ టోర్నమెంట్‌కు ఇంకా చాలా సమయం ఉంది, అందుకే దాని గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదన్నారు.

ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ వంటి వాటిలో వారి ప్రదర్శనను ప్రతిసారీ ఒక పరీక్షలా చూడటం అవివేకమని (Silly) అగార్కర్ అన్నారు. "వారిని ప్రతి మ్యాచ్‌లోనూ ట్రయల్‌లో ఉంచలేం" అని స్పష్టం చేశారు. ఒక సిరీస్‌లో పరుగుల చేయకపోయినంత మాత్రాన వారిని పక్కన పెట్టడం జరగదు, అదే విధంగా ఒక సిరీస్‌లో భారీగా స్కోర్ చేసినంత మాత్రాన 2027 ప్రపంచ కప్‌కు ఎంపిక అవుతారని హామీ ఇవ్వలేమని చెప్పారు.

వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నందున, ఫామ్‌లో ఉండటానికి, ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి అందుబాటులో ఉన్నప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాలని వారికి సూచించారు. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పగించడంపై స్పందిస్తూ, ఇది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమని తెలిపారు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లు ఉండటం ఆచరణాత్మకంగా కష్టమని (Practically impossible) తెలిపారు. వారిద్దరూ ప్రపంచ స్థాయి ఆటగాళ్లని అంగీకరిస్తూనే, 2027 ప్రపంచ కప్ వరకు వారి కొనసాగింపు అనేది వారి ఫిట్‌నెస్, ఫామ్, జట్టు అవసరాలపై ఆధారపడి ఉంటుందని అజిత్ అగార్కర్ పరోక్షంగా సూచించారు

Tags:    

Similar News