Asia Cup Today: ఇవాళ ఆసియా కప్ లో యూఏఈతో భారత్ తొలి మ్యాచ్

యూఏఈతో భారత్ తొలి మ్యాచ్

Update: 2025-09-10 06:04 GMT

Asia Cup Today: ఇవాళ ఆసియా కప్‌లో భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఆసియా కప్‌లో భారత్‌కు మొదటి మ్యాచ్, కాబట్టి భారత్ ఈ టోర్నమెంట్‌ను భారీ విజయంతో ప్రారంభించాలని భావిస్తోంది. ఎలా చూసినా ఈ టోర్నీలో ఇండియా ఫేవరెట్ గా కనిపిస్తోంది. ఇండియాతో తలపడిన ఏకైక టీ20 మ్యాచ్ లో యూఏఈ ఓడిపోయింది. 2016 ఆసియా కప్ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 9 వికెట్ల తేడాతో నెగ్గింది.

దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. అలాగే, సోనీలివ్ (SonyLIV) యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో చూడవచ్చు.

ఇండియా జట్టు అంచనా:

సూర్యకుమార్ యాదవ్ (సి), శుభమన్ గిల్ (విసి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ (వికెట్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి

యూఏఈ జట్టు అంచనా :

ముహమ్మద్ వసీం (సి), అలీషాన్ షరాఫు, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా (వికె), ఆసిఫ్ ఖాన్, హర్షిత్ కౌశిక్, ముహమ్మద్ ఫరూక్, సగీర్ ఖాన్, హైదర్ అలీ, జునైద్ సిద్ధిక్, ముహమ్మద్ జవదుల్లా

Tags:    

Similar News