Third T20 Match: ఇవాళ శ్రీలంకతో భారత్ మూడో టీ20

భారత్ మూడో టీ20

Update: 2025-12-26 06:29 GMT

Third T20 Match: ఇవాళ భారత్ , శ్రీలంక మహిళల జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది., తొలి రెండు మ్యాచ్‌లు విశాఖపట్నంలో జరగ్గా, నేటి నుంచి జరగబోయే మిగిలిన మూడు మ్యాచ్‌లకు తిరువనంతపురం వేదిక కానుంది. గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురంలో రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. భారత్ ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది. నేటి మ్యాచ్‌లో గెలిస్తే టీమ్ ఇండియా సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది.

టీమ్ ఇండియా ప్లేయర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ మిడిల్ ఆర్డర్‌లో బలంగా కనిపిస్తున్నారు. బౌలింగ్‌లో వైష్ణవి శర్మ, శ్రీచరణి వంటి యువ ఆటగాళ్లు ఆకట్టుకుంటున్నారు.శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టుపై ఆ జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది. సిరీస్ సజీవంగా ఉండాలంటే లంక ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.

వరుస ఓటములతో కుంగిపోయిన లంక ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కోసం తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. వేదిక మారడంతో తమ అదృష్టాన్ని కూడా మార్చుకోవాలని భావిస్తోంది. అయితే ఇది జరగాలంటే బ్యాటర్లు మెరవాల్సిన అవసరం చాలా ఉంది. ఇండియాతో పోలిస్తే ఆట నాణ్యతలో చాలా వ్యత్యాసం ఉండటం లంక ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లో మెరుగైన ఆరంభం లభిస్తున్నా.. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ చివరలో వరుసగా వికెట్లు పడటంతో భారీ స్కోరు చేయలేకపోతున్నారు. వాతావరణం అనుకూలిస్తే నేడు తిరువనంతపురంలో పరుగుల వరద పారే అవకాశం ఉంది.

Tags:    

Similar News