India vs New Zealand ODI Series: న్యూజిలాండ్ తో భారత్ వన్డే సిరీస్.. వీళ్లు జట్టులోకి వస్తారా.?

వీళ్లు జట్టులోకి వస్తారా.?

Update: 2026-01-02 02:31 GMT

India vs New Zealand ODI Series: న్యూ ఇయర్ (2026)లో టీమిండియా తన తొలి హోమ్ సిరీస్‌కు సిద్ధమవుతోంది. జనవరి 11న గుజరాత్‌లోని వడోదర (కోటంబి స్టేడియం) వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ మొదటి వన్డే ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును జనవరి 3న బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించే అవకాశం ఉంది.ఈ సిరీస్ ద్వారా ఐదుగురు కీలక ఆటగాళ్లు మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

మెడ గాయం కారణంగా గత నవంబర్-డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్, ఈ సిరీస్‌తో మళ్ళీ మైదానంలోకి దిగనున్నాడు. అక్టోబర్ 4, 2025న టీమిండియా వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గిల్, న్యూజిలాండ్‌తో సిరీస్‌లో జట్టును ముందుండి నడిపించనున్నాడు.ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ (మార్చి 9) తర్వాత షమీ మళ్లీ భారత్ తరఫున వన్డే మ్యాచ్ ఆడబోతున్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించిన షమీ (108 వన్డేల్లో 206 వికెట్లు), తన అనుభవంతో బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయనున్నాడు.

దక్షిణాఫ్రికా సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన అక్షర్ పటేల్, ఈ స్వదేశీ సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఐదో నంబర్ బ్యాటర్‌గా అక్షర్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత వన్డే జట్టులోకి తిరిగి వస్తున్నాడు. 2023 అక్టోబర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో చివరి వన్డే ఆడిన ఇషాన్, ఇప్పుడు రిషబ్ పంత్‌కు బ్యాకప్‌గా సెకండ్ వికెట్ కీపర్-బ్యాటర్‌గా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. గత అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో వన్డే ఆడిన సిరాజ్‌ను దక్షిణాఫ్రికా సిరీస్ నుండి పక్కన పెట్టారు. అయితే, న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం సెలెక్టర్లు మళ్ళీ సిరాజ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News