Indian Premier League Final: బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు ఐపీఎల్ ఫైనల్.. అసలు కారణం ఇదే!

అహ్మదాబాద్‌కు ఐపీఎల్ ఫైనల్.. అసలు కారణం ఇదే!

Update: 2026-05-07 05:16 GMT

Indian Premier League Final: క్రికెట్ ప్రేమికులకు షాకింగ్ న్యూస్. ఈ ఏడాది ఐపీఎల్ గ్రాండ్ ఫినాలే వేదిక మారింది. వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ ఫైనల్ పోరుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియమే ఆతిథ్యం ఇవ్వబోతోంది. వాస్తవానికి బెంగళూరులో జరగాల్సిన ఈ మెగా ఫైట్, అనూహ్య కారణాలతో గుజరాత్‌కు తరలిపోయింది.

నిజానికి గత ఏడాది విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కావడంతో.. సంప్రదాయం ప్రకారం ఫైనల్ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాలి. కానీ, స్థానిక సంఘం , అధికారుల నుంచి వచ్చిన కొన్ని అదనపు డిమాండ్లు బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ,ఎంపీలకు తలా మూడు కాంప్లిమెంటరీ టిక్కెట్లు ఇవ్వాలనే ప్రతిపాదనను బోర్డు తిరస్కరించింది.

కేవలం టిక్కెట్ల కోటా మాత్రమే కాదు, చిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షక సామర్థ్యం తక్కువగా ఉండడం కూడా ఒక కారణం. అంతేకాకుండా, గత ఏడాది అక్కడ జరిగిన తొక్కిసలాట వంటి చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, క్రికెట్ అభిమానుల భద్రత కోసం బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్ స్టేడియం వైపు బోర్డు మొగ్గు చూపింది.

ప్లే ఆఫ్ షెడ్యూల్

మే 26న: ధర్మశాలలోని అందమైన హెచ్‌పీసీఏ స్టేడియంలో క్వాలిఫయర్ 1 జరుగుతుంది.

మే 27న: కొత్త చండీగఢ్‌లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎలిమినేటర్ పోరు ఉంటుంది.

మే 29న: ఇదే వేదికపై క్వాలిఫయర్ 2 నిర్వహిస్తారు.

Tags:    

Similar News