Indian Premier League Over Country: దేశం కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యత?.. ఆసీస్ ఆటగాళ్ల సంచలన నిర్ణయం!

ఆసీస్ ఆటగాళ్ల సంచలన నిర్ణయం!

Update: 2026-05-08 05:58 GMT

Indian Premier League Over Country: క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దేశం తరుపున ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లా? లేక కోట్లు కురిపించే ఐపీఎల్ లీగ్ మ్యాచులా? ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు మాత్రం ప్రస్తుతం ఐపీఎల్‌కే జై కొడుతున్నారు. మే 30 నుంచి పాకిస్తాన్‌తో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్ కంటే.. ఐపీఎల్ ప్లేఆఫ్స్ , ఫైనల్ మ్యాచ్‌లే తమకు ముఖ్యమని ఆసీస్ ఆటగాళ్లు నిర్ణయించుకున్నారు.

దీనికి సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. కెప్టెన్ పాట్ కమిన్స్‌తో సహా కీలక ఆటగాళ్లు ఐపీఎల్‌లో కొనసాగేందుకు బోర్డు అనుమతినిచ్చింది. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఐపీఎల్ లీగ్ దశ మే 24తో ముగుస్తుంది, మే 31న గ్రాండ్ ఫైనల్ జరగనుంది. కానీ, పాకిస్తాన్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు మే 23నే ఇస్లామాబాద్ చేరుకోవాల్సి ఉంది.ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. తమ ఐపీఎల్ జట్లు ప్లేఆఫ్ రేసులో ఉండటంతో ఆసీస్ స్టార్లు పాక్ విమానం ఎక్కేందుకు సిద్ధంగా లేరు.

ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న కెప్టెన్ పాట్ కమిన్స్, విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్.. తమ జట్టును ప్లేఆఫ్స్‌లో ముందుకు నడిపించేందుకు ఇక్కడే ఉండనున్నారు. వీరితో పాటు జోష్ హేజిల్‌వుడ్, టిమ్ డేవిడ్, జేవియర్ బార్ట్లెట్, మార్కస్ స్టోయినిస్ ,కూపర్ కానోలీలు కూడా తమ ఐపీఎల్ ఫ్రాంచైజీల విజయాల కోసం పాక్ టూర్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

అయితే, అందరూ రాకుండా ఉండటం లేదు! ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ గనుక నాకౌట్ దశకు చేరుకోకపోతే.. మిచెల్ స్టార్క్, కెమెరాన్ గ్రీన్‌లు టోర్నీ నుంచి తప్పుకుని నేరుగా పాకిస్తాన్ వెళ్లే అవకాశం ఉంది. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్ ఆశలు దాదాపు గల్లంతవ్వడంతో.. మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్ మొదటి వన్డే సమయానికి పాక్ చేరుకుని జట్టుతో కలిసే అవకాశం కనిపిస్తోంది.ఏదేమైనా ఆస్ట్రేలియా లాంటి అగ్రశ్రేణి జట్టు.. కీలక సిరీస్ కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News