Indian Premier League Season 19: ఐపీఎల్ సీజన్ 19లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. వాంఖడే స్టేడియం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ (KKR)పై జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముంబై పల్టన్ జోరుకు కేకేఆర్ బౌలర్లు తలవంచక తప్పలేదు.

ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 220 పరుగులు చేసింది. ఓపెనర్ అజింక్యా రహానే 67, ఫిన్ అలెన్ 37,రఘువంశీ 51,రింకూ సింగ్ 33 పరుగులు చేసి జట్టకు భారీ స్కోరును అందించారు.

ఇక లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ఏమాత్రం తడబడలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ 6 సిక్సులు,6 ఫోర్లతో 78, 8 సిక్సులతో ర్యాన్ రికెల్టన్ 81 పరుగులతో అందించిన మెరుపు ఆరంభం మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. మధ్యలో కేకేఆర్ స్పిన్నర్లు ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా, ముంబై బ్యాటర్లు సంయమనంతో ఆడుతూనే భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. సిక్సర్ల వర్షంతో వాంఖడే స్టేడియం హోరెత్తిపోయింది.

చివరికి మరో 5 బంతులు మిగిలి ఉండగానే, 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జయకేతనం ఎగురవేసింది. ఈ విజయం ముంబై అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Tags: