Abhinav Deshwal Wins Gold Medal: డెఫ్లింపిక్స్‌లో మెరిసిన భారత షూటర్.. అభినవ్ దేశ్వాల్‌కు స్వర్ణ పతకం

అభినవ్ దేశ్వాల్‌కు స్వర్ణ పతకం

Update: 2025-11-24 06:32 GMT

Abhinav Deshwal Wins Gold Medal: డెఫ్లింపిక్స్‌‌లో మరో భారతీయ షూటర్ తన సత్తా చాటాడు. పురుషుల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత షూటర్ అభినవ్ దేశ్వాల్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచాడు. అభినవ్ దేశ్వాల్ ఫైనల్‌కు ముందు క్వాలిఫికేషన్‌లో అద్భుతంగా రాణించాడు. అతడు 575 పాయింట్లతో ప్రపంచ రికార్డును సమం చేసి అగ్రస్థానంలో నిలిచాడు.

ఫైనల్‌ ప్రదర్శన

తుది పోరులోనూ అదే జోరు కొనసాగించిన అభినవ్, మొత్తం 44 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ ఈవెంట్‌లో సెంగ్‌ లీ (43, కొరియా) రజతం గెలుచుకోగా, ఫోర్‌మిన్‌ (42, ఉక్రెయిన్‌) కాంస్యం సాధించారు.

మరో భారత షూటర్ నిరాశ

భారత్‌కు చెందిన మరో షూటర్ చేతన్ హన్మంత్ క్వాలిఫికేషన్‌లో 573 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ ఫైనల్‌లో రాణించలేకపోయాడు. అతడు 27 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

Tags:    

Similar News