Indian Women's Cricket Team: 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన భారత మహిళల క్రికెట్ జట్టు

భారత మహిళల క్రికెట్ జట్టు

Update: 2026-06-30 07:30 GMT

Indian Women's Cricket Team: భారత క్రికెట్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్! లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా జరగబోయే 2028 ఒలింపిక్స్‌కు ఇండియా విమెన్స్ క్రికెట్ జట్టు అధికారికంగా అర్హత సాధించింది. 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్‌ అడుగుపెడుతుండగా.. టీమిండియా అందులో చోటు దక్కించుకోవడం విశేషం.

ప్రస్తుతం జరుగుతున్న విమెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌లో ఆసియా ఖండం నుంచి అత్యుత్తమ స్థానంలో నిలిచిన జట్టుగా భారత్ ఈ ఒలింపిక్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ మేరకు సరికొత్త క్వాలిఫికేషన్ రూల్స్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఒలింపిక్స్‌లో మెన్స్, విమెన్స్ విభాగాల్లో కేవలం చెరో ఆరు జట్లు మాత్రమే తలపడనున్నాయి.

భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా జట్లు కూడా ఇప్పటికే అర్హత సాధించాయి. ఇక ఆతిథ్య దేశంగా ఉన్న అమెరికాకు మెన్స్, విమెన్స్ రెండు విభాగాల్లోనూ నేరుగా ప్రవేశం లభించింది. అయితే, ఈ వరల్డ్‌ కప్‌లో వెస్టిండీస్ సెమీస్‌కు చేరినా ఒలింపిక్స్‌కు మాత్రం క్వాలిఫై కాలేకపోయింది. ఎందుకంటే వెస్టిండీస్ అనేది ఒకే దేశం కాదు.. అది జమైకా, బార్బడోస్ వంటి అనేక కరేబియన్ దేశాల కలయిక. ఒలింపిక్స్ రూల్స్ ప్రకారం ఒకే ఒలింపిక్ కమిటీ (NOC) ఉన్న దేశాలకే ఆడే ఛాన్స్ ఉంటుంది.

మరి మన మెన్స్ టీమ్ పరిస్థితి ఏంటి? భారత పురుషుల జట్టు నేరుగా ఒలింపిక్స్‌కు క్వాలిఫై అవ్వాలంటే.. ఈ ఏడాది ముగిసేనాటికి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఆసియా ఖండంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News