India's third ODI against Australia: ఆస్ట్రేలియా బ్యాటింగ్...ఇండియాకు వైట్ వాష్ తప్పేనా..?
ఇండియాకు వైట్ వాష్ తప్పేనా..?
India's third ODI against Australia: ఆస్ట్రేలియాతో ఇండియా మూడో వన్డే ప్రారంభమైంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా స్కోర్ 31పరుగులు చేసింది.క్రీజులో మిచెల్ మార్ష్ 7, ట్రావిస్ హెడ్ 17 పరుగులతో ఉన్నారు. ఇండియా జట్టులోకి నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ స్థానాల్లో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ వచ్చారు. ఆస్ట్రేలియా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది.బార్ట్ లెట్ స్థానంలో ఎల్లిస్ వచ్చాడ. ఇప్పటికే రెండు వన్డేలో గెలిచిన ఆస్ట్రేలియా ఈ వన్డే గెలిచి వైట్ వాష్ చేయాలని చూస్తోంది. మరో వైపు ఎలాగైనా మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఇండియా చూస్తోంది
భారత్ జట్టు
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ
ఆస్ట్రేలియా జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్