IPL 2026: కింగ్ కోహ్లీ ఊచకోత.. గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ

గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ

Update: 2026-04-25 05:45 GMT

IPL 2026: ఐపీఎల్-19లో అహ్మదాబాద్ మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది. కింగ్ కోహ్లీ బ్యాట్ ఝుళిపిస్తే రికార్డులు తిరగరాయాల్సిందే అని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచే విరుచుకుపడింది. ముఖ్యంగా సాయి సుదర్శన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 28 బంతుల్లోనే 11 ఫోర్లు, 5 సిక్సర్లతో మెరుపు సెంచరీ సాధించి స్టేడియంను హోరెత్తించాడు. సుదర్శన్ సునామీతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ ముందు 206 పరుగుల క్లిష్టమైన లక్ష్యం నిలిచింది."

లక్ష్యం పెద్దదే.. కానీ క్రీజులో ఉన్నది ‘ఛేజ్ మాస్టర్’ విరాట్ కోహ్లీ! మొదటి బంతి నుంచే కోహ్లీ తన క్లాస్ చూపించాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేసి గుజరాత్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. కోహ్లీకి తోడుగా దేవదత్ పడిక్కల్ కూడా విధ్వంసం సృష్టించాడు. పడిక్కల్ కేవలం 27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 55 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరి మెరుపులతో మ్యాచ్ ఆర్సీబీ వైపు మలుపు తిరిగింది.

చివరికి 18.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసిన బెంగళూరు, 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది ఐదో విజయం. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ బెంగళూరు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News