Koneru Humpy: రికార్డ్ సృష్టించిన కోనేరు హంపి

కోనేరు హంపి;

Update: 2025-07-21 10:53 GMT

Koneru Humpy: మహిళల ఫిడే ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.

క్వార్టర్-ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి యుక్సిన్ సాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో హంపి తొలి గేమ్‌లో విజయం సాధించి, రెండో గేమ్‌ను డ్రా చేసుకున్నారు. దీంతో 1.5- 0.5 పాయింట్ల ఆధిక్యంతో ఆమె సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించారు.

సెమీ-ఫైనల్‌లో హంపి చైనాకు చెందిన టాప్ సీడ్ లీ టింగ్‌జీతో తలపడనున్నారు. మరో సెమీ-ఫైనల్ బెర్త్‌ కోసం భారత క్రీడాకారిణులు ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్ మధ్య జరిగిన మ్యాచ్ టై బ్రేకర్‌కు దారితీసింది.

Tags:    

Similar News