Koneru Humpy Reaches Final: ఫైనల్ కు కోనేరు హంపి..రేపే టైటిల్ ఫైట్

.రేపే టైటిల్ ఫైట్;

Update: 2025-07-25 05:42 GMT

Koneru Humpy Reaches Final: చెస్ లెజెండ్ తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్స్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో ఆమె చైనాకు చెందిన లీ టింగ్జీని 5-3 తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ టై-బ్రేక్‌కు వెళ్లింది, అక్కడ హంపి తన నైపుణ్యాన్ని ప్రదర్శించి విజయం సాధించింది.ఫిడే మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్‌కు చేరిన మొట్టమొదటి భారతీయ మహిళా గ్రాండ్ మాస్టర్‌గా కోనేరు హంపి చరిత్ర సృష్టించి ఇపుడు ఫైనల్‌కు కూడా చేరింది.

ఈ ప్రపంచ కప్‌లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఫైనల్ కోనేరు హంపి మరో భారతీయ యువ గ్రాండ్ మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ మధ్య జరగనుంది. దీనితో ఫిడే మహిళల ప్రపంచ కప్ టైటిల్ భారత్‌కే దక్కడం ఖాయమైంది. కోనేరు హంపి,దివ్య దేశ్‌ముఖ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఈ నెల జూలై 26, 27, 28 తేదీల్లో జరగనుంది.

కోనేరు హంపి ప్రదర్శన భారత చెస్ ప్రపంచానికి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది.ఆమె భవిష్యత్తులో కూడా ఇలాగే మరిన్ని విజయాలు సాధిస్తూ దేశ కీర్తిని ఇనుమడింపజేయాలని దేశం మొత్తం కోరుకుంటుంది. కోనేరు హింపికి భారత ప్రభుత్వం నుంచి అర్జున , పద్మశ్రీ పురస్కారాలు పొందింది. 

Tags:    

Similar News