Tourist Family:టూరిస్ట్ ఫ్యామిలీతో ఛత్రపతి మూవీకి లింక్.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్
ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్;
Tourist Family: చిన్న బడ్జెట్ తమిళ చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ గత నెలలో థియేటర్లలో విడుదలై పెద్ద హిట్ గా నిలిచింది. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 7 కోట్లతో తీసిన ఈ మూవీ 80కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. శ్రీలంక నుండి తమిళనాడుకు అక్రమంగా వలస వచ్చిన ఒక తమిళ కుటుంబం కథనే ఈ మూవీ. OTTలో కూడా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ః
ఈ క్రమంలో ఈ మూవీపై పలు విమర్శలు వస్తున్నాయి. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా చూసిన కొంతమంది ఆ సినిమా స్టోరీ లైన్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా అక్రమ వలసలను ప్రోత్సహిస్తుందని.. ఆరోపించారు. భారతదేశం ప్రస్తుతం అక్రమ వలసదారుల సమస్యతో పోరాడుతోంది. కానీ అక్రమ వలసలను కీర్తిస్తున్న 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాను బ్యాన్ చేయాలంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మరికొంతమంది ప్రభాస్ నటించిన 'ఛత్రపతి' సినిమాను ఉదాహరణగా తీసుకుని సోషల్ మీడియాలో 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాకు మద్ధతుగా నిలుస్తున్నారు. ఆ సినిమాలో ప్రభాస్, అతని కుటుంబం శ్రీలంక నుంచి తప్పించుకుని వైజాగ్ వస్తారు. ఆ సినిమాలో ప్రభాస్ ను హీరోగా కీర్తించారు. కానీ 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాను మాత్రం ఎందుకు విమర్శిస్తున్నారంటూ కౌంటర్లు వేస్తున్నారు.
'ఛత్రపతి' సినిమాలో, ప్రభాస్, అతని తల్లి, సోదరుడు శ్రీలంక నుండి తప్పించుకుని వైజాగ్ వస్తారు. వారి పత్రాలను స్థానిక ప్రభుత్వం పరిశీలిస్తుంది. వారు అధికారిక వలసదారులుగా పేర్కొంటారు. కానీ 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాలో శశికుమార్ కుటుంబం ఉద్దేశపూర్వకంగా ఈ విషయాన్ని పోలీసుల నుంచి దాచిపెడుతుంది. స్థానికులు కూడా వారికి సహకరిస్తారు. అలాంటప్పుడు ఛత్రపతి మూవీతో ఎందుకు పోలుస్తారని ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు లేని చర్చ, విమర్శలు.. ఇప్పుడు OTTలో విడుదలైన తర్వాత రావడం మాత్రం గమనార్హం.