Neeraj Chopra: నీరజ్ చోప్రా జోరు.. కామన్వెల్త్ జావెలిన్ ఫైనల్స్‌లో ముగ్గురు భారత అథ్లెట్లు.

ముగ్గురు భారత అథ్లెట్లు.

Update: 2026-07-31 04:07 GMT

Neeraj Chopra: కామన్వెల్త్ గేమ్స్ జావెలిన్ త్రో క్వాలిఫైయింగ్ రౌండ్లో భారత అథ్లెట్లు అదరగొట్టారు! స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో పాటు మరో ఇద్దరు భారత అథ్లెట్లు ఫైనల్ రేసులోకి దూసుకెళ్లారు.గ్రేట్ గ్లాస్గో వేదికగా జరిగిన ఈ అర్హత పోటీల్లో... బలమైన గాలులు వీస్తూ వాతావరణం పూర్తిగా ప్రతికూలంగా మారడంతో, ఎవరూ కూడా డీఫాల్ట్ క్వాలిఫికేషన్ మార్కైన 84 మీటర్ల దూరాన్ని అందుకోలేకపోయారు. అయినప్పటికీ, మన భారత అథ్లెట్లు అద్భుత పోరాట పటిమ కనబరిచారు.

ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా 79.61 మీటర్ల దూరంతో ఐదో స్థానంలో నిలవగా... రోహిత్ యాదవ్ 78.37 మీటర్లతో తొమ్మిదో స్థానాన్ని, యశ్ వీర్ సింగ్ 78.36 మీటర్ల ప్రదర్శనతో పదో స్థానాన్ని సాధించి ముగ్గురూ ఫైనల్స్ కు అర్హత సాధించారు.శ్రీలంక అథ్లెట్ రుమేశ్ తరంగ 82.84 మీటర్లతో అగ్రస్థానంలో నిలవగా... గ్రెనెడా స్టార్ అండర్సన్ పీటర్స్, పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ సైతం ఫైనల్స్ కు చేరుకున్నారు.

వాతావరణం సవాల్ గా మారినప్పటికీ, మన త్రోయర్లు ఫైనల్స్ పైనే పూర్తి దృష్టి పెట్టారు. ఇవాళ రాత్రి 10:15 గంటలకు జరగనున్న ఈ ఫైట్ లో... మన భారత అథ్లెట్లు పతకాలు సాధించి చరిత్ర సృష్టిస్తారని ఆశిద్దాం.

Tags:    

Similar News