Australian Legendary Bowler Brett Lee: ఆసిస్ దిగ్గజ బౌలర్ బ్రెట్ లీకి అరుదైన గౌరవం

బ్రెట్ లీకి అరుదైన గౌరవం

Update: 2025-12-29 11:25 GMT

Australian Legendary Bowler Brett Lee: ఆస్ట్రేలియా దిగ్గజ వేగవంతమైన బౌలర్ బ్రెట్ లీకి అరుదైన గౌరవం దక్కింది.బ్రెట్ లీని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ 'హాల్ ఆఫ్ ఫేమ్' లోకి చేర్చి గౌరవించింది. క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లకు మాత్రమే దక్కే అరుదైన గౌరవం ఇది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయన సాధించిన రికార్డులు, ముఖ్యంగా 700లకు పైగా వికెట్లు తీసినందుకు గాను ఈ గుర్తింపు లభించింది.ప్రపంచంలోనే అత్యంత వేగంగా బౌలింగ్ చేసే బౌలర్లలో ఒకరు (సుమారు 161.1 kmph వేగంతో బౌలింగ్ చేశారు).

రెండు సార్లు ప్రపంచ కప్ గెలిచిన జట్టులో (2003, 2007) సభ్యుడిగా ఉన్నారు.

1999 నుంచి 2012 వరకు ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రాతినిధ్యం వహించిన బ్రెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీ 76 టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, 221 వన్డేలు, 25 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 718 వికెట్లు తీశాడు. టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో 310, వన్డేల్లో 380, టీ20ల్లో 28 ఉన్నాయి. కేవలం బౌలింగ్ మాత్రమే కాకుండా, గాయకుడిగా, నటుడిగా కూడా ఆయన పాపులర్ అయ్యారు.సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆయన పేరు మీద ఒక స్టాండ్‌ను లేదా ప్రత్యేకమైన గుర్తింపును ఇవ్వడం ద్వారా ఆస్ట్రేలియా క్రికెట్ ఆయన సేవలను కొనియాడింది.

Tags:    

Similar News