2027 World Cup Head: రోహిత్,కోహ్లీ.. 2027 వరల్డ్ కప్ ఆడతారు: హెడ్

2027 వరల్డ్ కప్ ఆడతారు: హెడ్

Update: 2025-10-17 12:42 GMT

2027 World Cup Head: ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ భారత దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడటంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రోహిత్, కోహ్లీ ఇద్దరూ 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఆడాలని భావిస్తున్నారని, ఆ టోర్నీ కోసం సిద్ధమవుతున్నారని తాను నమ్ముతున్నట్లు హెడ్ అన్నారు.

ఆదివారం ఆస్ట్రేలియాతో ఇండియా మొదటి వన్డే మ్యా్చ్ జరగనుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా నుంచి ట్రావిస్ హెడ్, భారత్ నుంచి అక్షర్ పటేల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిత్, కోహ్లీ గురించి మాట్లాడాడు హెడ్. ఆ ఇద్దరు ఇంకా క్రికెట్ ఆడుతుండటం ఆటకే మేలని నేను భావిస్తున్నాను" అని ట్రావిస్ హెడ్ అభిప్రాయపడ్డారు.

విరాట్ కోహ్లీ నిస్సందేహంగా ప్రపంచంలోనే గొప్ప వైట్ బాల్ ప్లేయర్. రోహిత్ కూడా అంతే. ఓపెనర్‌గా ఆయన చేసిన కృషి గొప్పది. ఆయన నాకంటే వెనుక లేరు (నాకంటే గొప్ప). ఆయనను చూస్తే నాకు చాలా గౌరవం ఉంది అని హెడ్ ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో పక్కనే ఉన్న భారత ఆటగాడు అక్షర్ పటేల్ చిరునవ్వు నవ్వడం వైరల్ గా మారింది. వీరిద్దరి భవిష్యత్తు గురించి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ట్రావిస్ హెడ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags:    

Similar News