ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ లో షెఫాలీ దూకుడు

షెఫాలీ దూకుడు

Update: 2025-12-31 05:35 GMT

ICC Rankings: ఐసీసీ (ICC) తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఆటగాళ్లు షెఫాలీ వర్మ, రేణుక సింగ్ తమ ర్యాంకులను గణనీయంగా మెరుగుపరుచుకున్నారు. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరచడం వల్ల వీరికి ఈ ప్రయోజనం చేకూరింది.

షెఫాలీ వర్మ నాలుగు స్థానాలు ఎగబాకి ప్రస్తుత 6వ స్థానానికి చేరుకుంది.శ్రీలంకపై జరిగిన సిరీస్‌లో వరుసగా మూడు అర్ధసెంచరీలు (69*, 79*, 79 పరుగులు) సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉండటం. రేణుక సింగ్ ఠాకూర్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఏకంగా 8 స్థానాలు మెరుగుపరుచుకుని టాప్-10లోకి ప్రవేశించింది. శ్రీలంకతో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో 21 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించడం.

దీప్తి శర్మ టీ20 బౌలింగ్ విభాగంలో నెం.1 స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆల్ రౌండర్ల జాబితాలో 3వ స్థానంలో ఉంది.స్మృతి మంధాన బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 3వ స్థానంలో కొనసాగుతోంది.జెమిమా రోడ్రిగ్స్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానానికి పడిపోయింది.భారత మహిళల జట్టు ప్రస్తుతం ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో 3వ స్థానంలో ఉంది.

Tags:    

Similar News