Sundar Ruled Out of T20 Series: న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు సుందర్ దూరం
టీ20 సిరీస్ కు సుందర్ దూరం
Sundar Ruled Out of T20 Series: టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ (BCCI) అధికారికంగా ధృవీకరించింది.
న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో బౌలింగ్ చేస్తున్నప్పుడు సుందర్ పక్కటెముకల కండరాల నొప్పితో (Side Strain) ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. తదుపరి చికిత్స , కోలుకోవడం కోసం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) కి వెళ్లనున్నారు.
సుందర్ దూరం కావడంతో సెలెక్టర్లు అతని స్థానంలో మరొక స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకున్నారు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో టీ20 జట్టులోకి వచ్చారు.గాయపడిన తిలక్ వర్మ స్థానంలో (మొదటి మూడు టీ20లకు) అయ్యర్ జట్టులోకి ఎంపికయ్యారు.
ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ప్రకటించిన భారత జట్టులో వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు తగిలిన గాయం కారణంగా ఆయన వరల్డ్ కప్ ఆడతారా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఐసీసీ నిబంధనల ప్రకారం జనవరి 31 వరకు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది.
,
భారత్ vs న్యూజిలాండ్ టీ20 సిరీస్ లో భాగంగా.. మొదటి టీ20 జనవరి 21 (నాగ్‌పూర్), రెండో టీ20 జనవరి 23 (రాయ్‌పూర్),మూడో టీ20 జనవరి 25 (గువాహటి)లో మూడో టీ20 జరగనుంది.