Tilak Varma Named India A Captain: భారత్- ఎ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్

వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్

Update: 2026-05-15 02:13 GMT

Tilak Varma Named India A Captain: శ్రీలంక వేదికగా జరగనున్న ముక్కోణపు సిరీస్ కోసం భారత సెలక్షన్ కమిటీ ‘భారత్-ఎ’ జట్టును ప్రకటించింది. జూన్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో తెలుగు కుర్రాడు, టీమ్ ఇండియా యువ సంచలనం తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. ఈ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఆల్ రౌండర్ రియాన్ పరాగ్‌ను ఎంపిక చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

భారత్-ఎ, శ్రీలంక-ఎ ,అఫ్గానిస్థాన్-ఎ జట్ల మధ్య దంబుల్లా వేదికగా ఈ పోరు సాగనుంది. ఈ సిరీస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు టీనేజీ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. అద్భుత ఫామ్‌లో ఉన్న ఈ యువ ఆటగాడికి సెలక్టర్లు పెద్ద పీట వేశారు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ సిరీస్‌లో ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌లో తలపడతాయి.

ఇక జట్టు విషయానికొస్తే.. బ్యాటింగ్ విభాగంలో ప్రియాంశ్ ఆర్య, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు వంటి హిట్టర్లు ఉండగా.. వికెట్ కీపర్లుగా ప్రభ్‌సిమ్రన్ సింగ్, కుమార్ కుషాగ్రాను ఎంపిక చేశారు. బౌలింగ్ విభాగంలో యశ్ ఠాకూర్, అంశుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, యుధ్వీర్ సింగ్‌లతో పేస్ దళం బలంగా కనిపిస్తోంది. ముక్కోణపు సిరీస్ అనంతరం భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య రెండు మల్టీ డే మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి.

యువ రక్తం, అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కలయికతో ఉన్న ఈ జట్టు.. లంక గడ్డపై ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News