Rohit Sharma 2.0 Version: రోహిత్ 2.0 వెర్షన్ అంటే ఏంటి.?

వెర్షన్ అంటే ఏంటి.?

Update: 2026-03-31 05:49 GMT

Rohit Sharma 2.0 Version: కోల్ కతా నైట్ రైడర్స్ పై 78 పరుగులతో రోహిత్ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్' రోహిత్ శర్మలో మనం ఇప్పుడు 'రోహిత్ శర్మ 2.0' వెర్షన్‌ను చూస్తున్నామని అనీల్ కుంబ్లే అన్నారు. అసలు కుంబ్లే ఎందుకు అలా అన్నారంటే..

​ కుంబ్లే గమనించినట్లుగా.. రోహిత్ ఇప్పుడు తన వ్యక్తిగత స్కోర్ల కంటే జట్టు అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ, జట్టుకు భారీ పునాది వేస్తున్నాడు. అది 40 పరుగులైనా సరే, అవి మ్యాచ్ గమనాన్ని మార్చేలా ఉంటున్నాయి. ఇదే రోహిత్ 2.0 లోని ప్రధాన మార్పు.

ఇప్పుడు మరింత పరిణతి చెందాడు. కుంబ్లే అభిప్రాయం ప్రకారం.. రోహిత్ జట్టులో ఒక 'ఫియర్ లెస్' (భయం లేని) సంస్కృతిని తీసుకువచ్చాడు. తన బ్యాటింగ్‌తో తనే ముందుండి ఉదాహరణగా నిలుస్తూ, యువ ఆటగాళ్లకు ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. తన నిర్ణయాల్లో స్పష్టత, క్లిష్ట సమయాల్లో ప్రశాంతత.. ఇవన్నీ రోహిత్‌ను ఒక గొప్ప ప్లేయర్ గా నిలబెట్టాయి. అందుకే కుంబ్లే దీన్ని ఒక కొత్త శకంలా అభివర్ణించారు.

టెక్నిక్ పరంగా రోహిత్ ఎప్పుడూ క్లాస్ ప్లేయరే. అయితే, ఇప్పుడు ఆ క్లాస్‌కు అగ్రెషన్ (దూకుడు) తోడైంది. గతంలో ఇన్నింగ్స్ ఆరంభంలో కొంత సమయం తీసుకునే రోహిత్, ఇప్పుడు మొదటి బంతి నుంచే అటాక్ చేస్తున్నాడు. డిఫెన్స్‌కు వెళ్లకుండా అటాకింగ్ మోడ్‌లో ఉండటమే 'రోహిత్ 2.0' ప్రత్యేకత అని కుంబ్లే విశ్లేషించారు.

Tags:    

Similar News