తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం ముప్పు

మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు… వాతావరణ శాఖ హెచ్చరికలు;

Update: 2025-08-16 07:22 GMT

తెలుగు రాష్ట్రాలపైకి మరో అల్పపీడనం ముంచుకు వస్తోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనం వల్ల తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల, జనగాం, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే వరంగల్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌, నిర్మల్‌, ములుగు, మంచిర్యాల, మహబూబాబాద్‌, అసిఫాబాద్‌, కామారెడ్డి, భూపాలపల్లి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Tags:    

Similar News