Mlc Kavita : బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ సరైన చర్యే
బీఆర్ఎస్ కూడా నాదిరిలోకి రావాల్సిందే - ఎమ్మెల్సీ కవిత;
బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకు రావడం సరైన చర్యే అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కవిత మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 2018 పంచాయితీ రాజ్ చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే అన్నారు. ఆర్డినెన్స్ విషయంలో తాను న్యాయ నిపుణులతో చర్చించిన తరువాతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వస్తున్న ఆర్డినెన్స్ కు మద్దతు ప్రకటించానని కవిత తెలిపారు. ఆర్డినెన్స్ ను బీఆర్‌ఎస్ నేతలు వ్యతిరేకిండాన్ని ఆమె తప్పుబట్టారు. బీఆర్‌ఎస్ వాళ్లు కూడా ఈ విషయంలో తన దారిలోకి రావల్సిందే అని కవిత అన్నారు. ఓ నాలుగు రోజులు అటో ఇటో సమయం తీసుకుంటారేమో తప్పితే వాళ్లు కూడా ఆర్డినెన్స్ కు మద్దతు పలకాల్సిందే అని కవిత అభిప్రాయపడ్డారు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఇంత వరకూ స్పందికపోవడాన్ని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత అన్నారు. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని నా జనాభా లెక్కల్లోంచి తీసేసానని అతనెవరో కూడా నాకు తెలియదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు.