Danam Nagender: అనర్హత నోటీసులకు మరింత గడువు కోరుతూ.. స్పీకర్‌ను కలవనున్న దానం నాగేందర్!
స్పీకర్‌ను కలవనున్న దానం నాగేందర్!
Danam Nagender: పార్టీ ఫిర్యాదులు, అనర్హత ఆరోపణలతో ఇరుక్కున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కలవనున్నారు. స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసుకు సమాధానం సమర్పించేందుకు అదనపు సమయం అభ్యర్థించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ అంశంపై ఏఐసీసీ ఎత్తున్నలతో దానం నాగేందర్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే, తనకే మళ్లీ టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్లు వర్గాలు చెబుతున్నాయి. అనర్హత చట్టపరమైన ప్రక్రియలో ముందుకు వెళితే రాజీనామా చేస్తానని సన్నిహితులకు ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులకు స్పందించాల్సిందిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసింది. ఈ నెల 23వ తేదీలోగా అఫిడవిట్ రూపంలో సమాధానాలు స్పీకర్ కార్యాలయంలో సమర్పించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.