Kalvakuntla Kavitha: కృష్ణా, గోదావరి రెండు నదుల్లో గోదావరి నీళ్లే నల్గొండకు శ్రీరామరక్ష అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నల్గొండ జిల్లా డిండి జలాశయాన్ని శనివారం సందర్శించి డిండి ఎత్తిపోతల పథకానికి నీటి వనరులపై ప్రజంటేషన్ ఇచ్చిన ఆమె అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.


పట్టభద్రులకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని సహించమని చెప్పే అవకాశం వచ్చిందని కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నా ప్రతిపక్ష పార్టీలు నిద్రపోతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు, కార్మికులు, వృద్ధులు, వితంతువులు, నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు.


తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ అభ్యర్థి శ్రీకాంత్‌గౌడ్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ అభ్యర్థి ఆకాశ్‌లను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, ఆంధ్ర విడిపోయినప్పటికీ కేసీఆర్, రేవంత్ రెడ్డి కృష్ణానదిపై ఒక్క ప్రాజెక్టు నిర్మించలేదని విమర్శించారు. నల్గొండకు కృష్ణ, గోదావరి వంటి జీవనదులు ఉన్నప్పటికీ పంటలు ఎండటం శాపమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags: