Gutha Sukhendarreddy : కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయండి

సీయం రేవంత్‌రెడ్డికి లేఖ రాసిన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి;

Update: 2025-08-14 10:02 GMT

మన ఊరు మన బడి కార్యక్రమంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయాలని లేఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి లేఖ రాశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో పనులు చేసిన చిన్న చితకా కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారంతా తనని కలసి వారి పరిస్ధితి వివరించారని గుత్తా సీయంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద సివిల్ పనులు పూర్తయ్యాయని మరియు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు దీనిని ధృవీకరించారని , రాష్ట్రం అంతటా మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పూర్తయిన సివిల్ పనులకు పెండింగ్ బిల్లులు రూ.361.350 కోట్లు ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేసి వారిని ఆదుకోవాలని ఆయన లేఖాలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల (స్కూల్ పేరెంట్స్ కమిటీ) అవసరాలను తీర్చడం చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్య కాబట్టి పెండింగ్‌లో ఉన్న రూ.361.350 కోట్ల బిల్లులను విడుదల చేయాలని గుత్తా సుఖేందర్‌ రెడ్డి కోరారు. చిన్న మరియు పేద కాంట్రాక్టర్లు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల సభ్యులు చేతి రుణాలు తీసుకుని ఈ పనులను పూర్తి చేశారని, బిల్లులు రాకపోవడంతో నేడు వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీయంకి లేఖలో తెలిపారు. కాంట్రాక్టర్ల పరిస్థితుల దృష్ట్యా, మన ఊరు- మన బడి పథకం కింద రాష్ట్రం అంతటా పూర్తయిన సివిల్ పనులకు సంబంధించిన రూ.361.350 కోట్ల పెండింగ్ బిల్లులను అత్యంత ప్రాధాన్యతతో క్లియర్ చేయాలని ముఖ్యమంత్రిని లేఖ ద్వారా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభ్యర్థించారు.

Tags:    

Similar News