Telangana Assembly Speaker: పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ సమక్షంలో విచారణ: ప్రత్యక్ష సాక్షులా? మీడియా కథనాలు ఆధారాలా?

ప్రత్యక్ష సాక్షులా? మీడియా కథనాలు ఆధారాలా?

Update: 2025-09-30 05:07 GMT

Telangana Assembly Speaker: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో జరుగుతున్న విచారణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫిరాయించిన ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు, ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రశ్నల వర్షం కురిపించారు.

"కాంగ్రెస్‌లో చేరిన సమయంలో మీరు అక్కడే ఉన్నారా? ప్రత్యక్షంగా చూశారా? మీరు లేకుండా మీడియా కథనాలను ఎలా ఆధారాలుగా సమర్పిస్తారు?" అంటూ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, కాలే యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. ఒక్కో ఫిర్యాదుదారును 35-40 ప్రశ్నలతో ఎదుర్కొన్నట్లు సమాచారం.

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు: బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు), అరెకపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్ (కల్వకుంట్ల సంజయ్ ఫిర్యాదు), పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్ (జగదీశ్‌రెడ్డి ఫిర్యాదు), గూడెం మహిపాల్‌రెడ్డి, కాలే యాదయ్య (చింతా ప్రభాకర్ ఫిర్యాదు), తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి మొదలైనవారు.

ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ సమర్పించిన ఆధారాలు సరైనవేనని స్పష్టం చేశారు. ఈ విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి. బుధవారం ఫిరాయింపు నోటీసులు స్వీకరించిన ఎమ్మెల్యేలపై క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది.

Tags:    

Similar News