GHMC HYDRA : జిహెచ్ఎంసి నుంచి హైడ్రాకు పూర్తి సహకారం ఉంటుంది
జీహెచ్ఎంసీ, హైడ్రా ట్రాఫిక్, ఫైర్ శాఖల అధికారుల సమన్వయ సమావేశంలో కమిషనర్ ఆర్ వి కర్ణన్ స్పష్టీకరణ;
- విపత్తు నిర్వహణ కు హైడ్రా ప్రధాన బాధ్యత
- క్షేత్ర స్థాయిలో జీహెచ్ఎంసీ హైడ్రా టీమ్ గా కలిసి పని చేయాలి
- వర్షాకాల సీజన్ లో నగర ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలి
మాన్సూన్ ఎమర్జెన్సీ విపత్తుల సమయంలో హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో పనిచేసి నగర ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. విపత్తు నిర్వహణ, ప్రతిస్పందనకు హైడ్రా ప్రధాన బాధ్యత, మాన్సూన్ సీజన్ లో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు సాంకేతికంగా, లాజిస్టిక్, రిసోర్స్ పరంగా హైడ్రా కు వార్డు, సర్కిల్, జోనల్ వారిగా పూర్తి సహకారం అందించాలని అన్నారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వర్షాకాల సీజన్ లో ఉత్పన్నమయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఇ, డి.ఇ.ఇ,ఏఈఈ, ట్రాఫిక్, ఫైర్, హైడ్రా అధికారుల మధ్య సమన్వయం పెంచేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, హైడ్రా కమిషనర్ ఎ.వి రంగనాథ్ లు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ... వర్షాకాల సీజన్ లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు హైడ్రా కు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం సంపూర్ణంగా సహకరిస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓపెన్ నాలా డీ – సిల్టింగ్, నిర్వహణ, కొత్తగా నిర్మించిన సంపుల నిర్వహణ జిహెచ్ఎంసి చూసుకుంటుందని, లేక్ లలో నీటి నిల్వ స్థాయి సమాచారాన్ని హైడ్రాతో పంచుకుంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తామని అన్నారు.
హైడ్రా కమిషనర్ ఎ.వి రంగనాథ్ మాట్లాడుతూ... నగరంలోని 11 అండర్ పాస్ ల నిర్వహణ బాధ్యత హైడ్రా తీసుకుంటుందని చెప్పారు. ఫ్లై ఓవర్ ల పై వర్షపు నీరు నిలువకుండా చూసేందుకు వర్షపు నీరు వెళ్లే మార్గాలను క్లీనింగ్ బాధ్యత తాము చేస్తామని అన్నారు. క్యాచ్ పిట్ లలో డీ సిల్టింగ్ బాధ్యతలను, నాలా సేఫ్టీ ఆడిట్ బాధ్యతలు తాము చూస్తామని అన్నారు. క్యాచ్ పిట్ లలో డీ సిల్టింగ్ చేయగా వచ్చే మట్టిని తరలించేందుకు వీలుగా వార్డు వారిగా ట్ పాయింట్ ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ సహకరించాలని రంగనాథ్ సూచించారు. సమావేశంలో జోనల్ కమిషనర్ లు అనురాగ్ జయంతి, అపూర్వ చౌహాన్, హేమంత్ సహదేవరావు, రవి కిరణ్, వెంకన్న, చీఫ్ ఇంజనీర్ రత్నాకర్, ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, లేక్స్ చీఫ్ ఇంజనీర్ కోటేశ్వర రావు, డి ఎఫ్ ఓ పాపారావు తదితరులు పాల్గొన్నారు.