KCR Health :హై బ్లడ్ షుగర్ తో బాధపడుతున్న కేసీఆర్

యశోదా ఆసుపత్రిలో చికిత్స;

Update: 2025-07-04 03:32 GMT

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఒంట్లో నలతగా ఉండటంతో గురువారం ఆయన వైద్య పరీక్షల నిమిత్తం యశోదా ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్‌ కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు ఆయన్ను హస్పటల్‌ లో అడ్మిట్‌ కవాలని సలహా ఇచ్చారు. దీంతో కేసీఆర్‌ చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. యశోదా ఆసుపత్రి వర్గాలు కేసీఆర్‌ ఆరోగ్య పరిస్ధితిపై ఒక హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశాయి. ఒంట్లో బాగా నీరసంగా ఉందని వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆసుపత్రికి వచ్చినట్లు ఆ బులిటెన్‌ లో పేర్కొన్నారు. అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కేసీఆర్‌ కు సోడియం లెవెల్స్‌ తగ్గడంతో పాటు హై బ్లడ్‌ సుగర్‌ తో బాధపడుతున్నట్లు తేలిందని యశోదా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో ఆయన్ను ఇన్‌పేషెంట్‌ గా అడ్మిట్‌ చేసుకుని వైద్య చికిత్స అందిస్తున్నట్లు.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్ధితిపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆయనకు అందిస్తున్న చికిత్సను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సీయం రేవంత్ రెడ్డి వైద్య నిపుణులు, అధికారులతో మాట్లాడి చంద్రశేఖర్ రావుకు ఉత్తమ చికిత్స అందించాలని కోరారు. కేసీఆర్ త్వరగా కోలుకుని, మంచి ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో తన సాధారణ విధుల్లో చేరాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

Tags:    

Similar News