ఏఐజీలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు

KCR undergoes medical tests at AIG

Update: 2025-06-14 09:19 GMT


తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన శనివారం ఉదయం ఆసుపత్రికి వెళ్లారు. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగానే ఆయన వెళ్లినట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి. అయితే, నిన్న కూడా ఆయన ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. శుక్రవారం వైద్యపరీక్షలు పూర్తి కాకపోవడంతో.. ఆయన వరుసగా రెండో రోజు ఇవాళ కూడా ఆసుపత్రికి వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు ఆసుపత్రికి వచ్చిన కేసీఆర్, దాదాపు గంటసేపు అక్కడే ఉన్నారు.



ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్, ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ నాగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్‌కు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని వైద్యులు తెలిపారు. అయితే, ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారని సమాచారం.





Tags:    

Similar News