Cm Revanth Reddy : వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడండి

జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌ లో సీయం రేవంత్‌ రెడ్డి;

Update: 2025-07-22 04:11 GMT

వర్షాల కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని విభాగాలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో సీయం మాట్లాడుతూ జూన్‌ మాసం నుంచి ఇప్పటి వరకూ 21 శాతం తక్కువగా వర్షపాతం నమోదైన గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. భారీ వర్షల వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి హైదరాబాద్‌ లో 150 బృందాలను ఏర్పాటు చేసినట్లు సీయం కలెక్టర్లకు చెప్పారు. పోలీస్‌ కమీషనరేట్లకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా గ్రౌండ్‌ లో ఉండి నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని సీయం ఆదేశించారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాల వల్ల గిరిజనులు అంటు వ్యాధుల బారిన పడకుండా ఐటీడీఏ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీయం రేవంత్‌ రెడ్డి సూచించారు. పీహెచ్‌సీ, సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఎప్పుడూ అందబాటులో ఉండేలా కలెక్టర్లు పర్యవేక్షించాలని సీయం ఆదేశించారు. కలెక్టర్లు అన్ని విభాగాలపై ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందే అన్నారు. కలెక్టర్లు ఖచ్చితంగా క్షేత్ర స్ధాయి పర్యటనలకు వెళ్లాలని ఆదేశిస్తున్నానని, ఎవైనా నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీయం స్పష్టం చేశారు. ప్రతి రోజు కలెక్టర్ల కార్యచరణకు సంబంధించిన పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించాలని ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. యూరియా స్టాక్‌ కు సబంధించి ప్రతి ఎరువుల దుకాణం వద్ద స్టాక్‌ వివరాలను డిస్‌ప్లే చేయాలని రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఎరువల కొరత ఉన్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని స్టాక్‌ వివరాలన ఎప్పటికప్పుడు ఆన్‌ లైన్‌ లో పొందు పరచాలని సీయం అధికారులకు సూచించారు. సన్న బియ్యంతో రేషన్‌ కార్డులకు డిమాండ్‌ పెరిగిందని ఈనెల 25 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సీయం చెప్పారు. శాసనసభ్యులు, జిల్లా ఇంఛార్జ్‌ మంత్రులు, రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఈ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్లు కోఆర్డినేట్‌ చేసుకోవాలని సీయం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News