Minister Ponnam: అమిత్‌షాకు క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్
డిమాండ్
Minister Ponnam: రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ అమరవీరులపై అవమానకరంగా మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఇక్కడికి వచ్చే అర్హత లేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. నవంబరు 2న హైదరాబాద్‌కు రానున్న అమిత్‌షా తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
శుక్రవారం గాంధీభవన్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడిన పొన్నం, ‘‘కేంద్ర హోంశాఖ మంత్రి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని యాత్ర చేపడుతున్నారంటే.. ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇదే కాంగ్రెస్ సాధించిన విజయం. దేశం మొత్తం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’’ అని అన్నారు. జనగణనలో బీసీ కులగణన అంశాన్ని డా.కె.లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్లు అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసి వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కోర్టులో విజయం సాధించడం హర్షణీయమని కూడా పేర్కొన్నారు.