Union Minister Bandi sanjay : నేనూ పొన్నం కలిసి పనిచేస్తాం – బండి సంజయ్
హుస్నాబాద్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతాం;
మంత్రి పొన్నం ప్రభాకర్ నేనూ కలసి పనిచేస్తామని, ఇద్దరం కలసి హుస్నాబాద్ ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శనివారం ఆయన హుస్నాబాద్ లో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ భారత దేశాన్ని గెలిపిండం కోసం కార్గిల్ యుద్దంలో అసువులుబాసిన జవాన్లకు నివాళులు అర్పించారు. సైనికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ హుస్నాబాద్ లో ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే హుస్నాబాద్‌కు సైనిక్ స్కూల్ తీసుకువస్తామని, నవోదయ స్కూలు ఏర్పాటు చేసి వచ్చే సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభమయ్యేలా చేస్తామని ప్రకటించారు. పిల్లలందరూ సర్కారు బడుల్లో జరిగితే అందరికీ సైకిళ్ళు బహుమతిగా ఇస్తానన్నారు. ఈ సైకిల్ నరేంద్రమోడీ బహుమతని, వచ్చే ఏడాది కూడా పదొవ తరగతి విద్యార్థులకు సైకిళ్ళు ఇస్తానన్నారు. తర్వలోనే నర్సరీ నుంచి 6వ తరగతి చదివే పిల్లలకు మోడీ కిట్స్ అందచేస్తామని అందరూ బాగా చదివి ఉన్నత స్ధానాలకు చేరుకోవాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లను స్పూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని చెప్పారు.