Rape Case: పదేళ్ల బాలికపై అత్యాచారం కేసు: దోషికి 24 ఏళ్ల జైలు శిక్ష

దోషికి 24 ఏళ్ల జైలు శిక్ష

Update: 2025-09-16 07:47 GMT

Rape Case: పదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దోషి మర్రి ఊషయ్యకు 24 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.40,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశించింది. అలాగే, బాధిత బాలికకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది.

ఈ ఘటన 2023 మార్చిలో జరిగింది, దీనిపై నల్గొండ రూరల్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో పోక్సో కోర్టు ఇన్‌ఛార్జ్‌ జడ్జి రోజా రమణి సెప్టెంబరు 16, 2025న తీర్పు వెలువరించారు.

Tags:    

Similar News