Telangana Water : తెలంగాణ నీళ్ళను రేవంత్‌ రెడ్డి ఏపీకి కట్టబెడుతున్నారు

మన హక్కులను ధరాదత్తం చేస్తున్నారన్న మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి;

Update: 2025-07-17 06:45 GMT

కేసీఆర్‌ ఏ నీళ్ళ కోసమైతే పోరాడారో ఆ నీళ్ళను రేవంత్‌ రెడ్డి ఏపీకి కట్టబెడుతున్నారని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి ఆరోపించారు. గురువారత తెలంగాణ భవన్‌ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఒక్కో హక్కును కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏపీకి ధారాదత్తం చేస్తోందని తెలంగాణ వాదులను భయపడుతున్నారి జగదీష్‌ రెడ్డి తెలిపారు. మన నదులు మనకు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ మీటింగ్‌ కు సంబంధించి ఒక పత్రిక ఆంధ్రప్రదేశ్‌ ఎడిషన్లో బనకచర్లపై కమిటీ అని తెలంగాణ ఎడిషన్లో జల వివాదాలపై కమిటీ అని హెడ్‌ లైన్లు పెట్టిందని దీన్ని బట్టే తెలంగాణకు జరుగుతున్న ద్రోహం ఏమిటో ప్రజలందరికీ అర్ధమవుతోందని మాజీ మంత్రి పేర్కొన్నారు. రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నారో, చంద్రబాబు ఏపీ ప్రజలకు ద్రోహం చేస్తున్నారో ఈ వార్తపై చర్చతో తేలిపోవాలన్నారు.బనకచర్లపై సమావేశం అయితే తాను ఢిల్లీ వెళ్లనని ప్రకటించిన సీయం రేవంత్ రెడ్డి ఒక్క ఫోన్‌ కాల్‌ తో హుటాహుటీన ఢిల్లీ బయలుదేరి వెళ్లారని చెప్పారు. తెలంగాణ సోయి, తెలంగాణ ఆత్మ లేని వాళ్ళ పాలన నడుస్తోందని మేము మొదటి నుంచి చెపుతున్నది ఇప్పుడు వాస్తవమయ్యిందని జగదీష్‌ రెడ్డి చెప్పారు. బనకచర్ల పై ఇంత పచ్చి అబద్దం మాట్లాడిన రేవంత్ రెడ్డికి సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. అసలు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు డిమాండ్ చేయకుండా నిన్నటి మీటింగ్ కు సీఎం ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తన తప్పు కప్పి పుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి మళ్ళీ కేటీఆర్ కు నోటీసు ఇచ్చి డైవెర్షన్ రాజకీయాలకు తెర తీసే అవకాశముందని జగదీష్‌ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కూడా చంద్రబాబుకు వంత పాడుతూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని జగదీష్‌రెడ్డి ఆరోపించారు. సీఎం చేసిన ద్రోహానికి తెలంగాణ వాదుల రక్తం మరిగిపోతోందన్నారు. కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర పంపులు ఆన్ చేయకుండా గోదావరి జలాలను కిందకు వదిలే కుట్రను రేవంత్ రెడ్డి ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి మూటలు పంపినా మాకు అభ్యంతరం లేదు కానీ నీళ్ల విషయం లో రేవంత్ రెడ్డి తెలంగాణ కు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News