ఆరా మస్తాన్‌కి సిట్ పిలుపు

Update: 2025-07-01 05:14 GMT

తెలుగు రాష్ట్రాల్లో సుపరిచిత సెఫాలజిస్ట్‌ ఆరా మస్తాన్‌ని విచారణకు హాజరుకావాలని సిట్‌ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో సిట్‌ విచారణ జరుపుతున్న విషయం తెలిసింది. అయితే ఈ విచారణలో భాగంగా ఆరా మస్తాన్‌ కి సంబంధించిన రెండు ఫోన్‌ నెంబర్లు ట్యాప్‌ అవుతున్న విషయాన్ని సిట్‌ గుర్తించింది. దీంతో ఈ విషయమై విచారణకు సిట్‌ ముందు హాజరు కావాలని గతంలో ఒకటిరెండు సార్లు నోటీసులు జారీ చేసింది. అయితే పని ఒత్తిడి వల్ల తాన విచారణకు హాజరు కాలేకపోతున్నానని ఆరా మస్తాన్‌ సిట్‌ కు తెలియజేశారు. అయితే విచారణ త్వరగా ముగించాల్సిన అవసరం ఉన్నందున జూలై 2వ తేదీన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఉన్న సిట్‌ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరు కావాలని సిట్‌ అధికారులు మరో సారి ఆరా మస్తాన్‌ కి నోటీసులు జారీ చేశారు.

Tags:    

Similar News